తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మందుల సామేలు పెద్ద కొడుకైతే తాను చిన్న కొడుకునని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటాలో నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన శుక్రవారం మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టడంతోపాటు చిరకాల వాంఛగా ఉన్న ఎమ్మెల్సీ పదవిలో కూర్చోపెట్టిన తుంగతుర్తిని ఏనాటికి మర్చిపోనని అన్నారు.