చేప కొరికితే అర చేయిని తీసేసిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. కన్నూర్ జిల్లాలోని థలస్సెరీకి చెందిన టి.రాజేశ్ (38) ఫిబ్రవరి 10న పొలంలో చెరువు శుభ్రం చేశారు. ఆ సమయంలో ‘కడు’ రకం చేప అతని కుడి చేతి వేలిని కొరికింది. చికిత్స చేయించుకున్నా గాయం తగ్గలేదు. బొబ్బలు వచ్చి చేతికి వ్యాపించింది. ‘గ్యాస్ గ్యాంగ్రీన్’ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తేల్చారు. ఆపరేషన్ చేసి అరచేతిని పూర్తిగా తొలగించారు.