గ్రీన్‌ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసులు కాలేరు: జేడీ వాన్స్

72చూసినవారు
గ్రీన్‌ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసులు కాలేరు: జేడీ వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల గ్రీన్ కార్డ్ హోల్డర్ల హక్కులపై వ్యాఖ్యానించారు. గ్రీన్‌ కార్డు కలిగి ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసులు కాలేరని అన్నారు. అమెరికా సమాజంలోకి ఎవరిని చేర్చుకోవాలో అమెరికన్లే నిర్ణయిస్తారని తెలిపారు. నేరాలకు పాల్పడటం, సుదీర్ఘ కాలం దేశాన్ని విడిచిపెట్టడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి పరిస్థితుల్లో గ్రీన్ కార్డును రద్దు చేయవచ్చని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్