Feb 16, 2025, 01:02 IST/
చేనేత సంఘాల పదవీకాలం ఆరు నెలల పొడిగింపు
Feb 16, 2025, 01:02 IST
TG: రాష్ట్రంలోని చేనేత సంఘాల పాలకవర్గాల పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10 నుంచి వచ్చే ఆగస్టు 9వ తేదీ వరకు లేదా మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ఈ పొడిగింపు కొనసాగుతుందని తెలిపింది. పాలకవర్గాలున్న వాటికి, అధికారులు పర్సన్ ఇన్ ఛార్జులుగా ఉన్నవాటికీ ఈ పెంపుదల వర్తిస్తుందని వెల్లడించింది. రాష్ట్రంలోని 527 చేనేత సంఘాలకు చివరిసారిగా 2013 ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగాయి.