సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామ హైస్కూల్ విద్యార్థి బి. సుమన్ అండర్ 14 కబడ్డీ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. తుంగతుర్తి హై స్కూల్లో బుధవారం నిర్వహించినటువంటి గేమ్స్ లో ఎంపికయ్యారు. విద్యార్థి తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఈ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. అశోక్ రెడ్డి, పీడీ కే. మహేష్, ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.