టీఎస్ యుటిఎఫ్ సూర్యపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా సోమయ్య, అనిల్ కుమార్, ఉపాధ్యక్షునిగా పి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి గా వెంకటయ్య లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణకు నూతన కార్యవర్గం కృషి చేయడంతో పాటు సంఘ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. కాగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.