ఢిల్లీ నూతన సీఎం అతిశీ.. తన గురువు కేజ్రీవాల్‌పై తనకున్న గౌరవాభిమానాలను ప్రదర్శించారు. కేజ్రీవాల్ కోసం పక్కన కూర్చొని బాధ్యతలు చేపట్టారు. ‘నాకు ప్రస్తుతం భరతుడికి ఎదురైన పరిస్థితే ఉంది. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు.. భరతుడు పాలించాల్సి వచ్చింది. నాలుగు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ఢిల్లీలో మళ్లీ ఆయన అధికారాన్ని చేపడతారని విశ్వసిస్తున్నాను’ అని అన్నారు.