ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నక్రమంలో ఇరుగు పొరుగు వారు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహాలక్ష్మీ తల్లి, సోదరిని ఇంటి యజమాని పిలిపించారు. ముగ్గురూ కలిసి తలుపులు బద్ధలుకొట్టి చూశారు. ఫ్రిజ్ నుంచి కారుతున్న రక్తాన్ని చూసిన ముగ్గురూ…ఫ్రిజ్ ఓపెన్ చేసి చూడగా అందులో మహాలక్ష్మీ మృతదేహం ముక్కలు ముక్కలుగా చేసి కనిపించడంతో వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బాధితురాలి తల్లి, సోదరి ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.