ఆకాశంలో అద్భుతం.. భూమిపై రెండు సూర్యులు
అత్యంత ప్రకాశవంతమైన తోకచుక్క భూమికి దగ్గరగా రాబోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. జనవరి 13న సూర్యోదయానికి 35 నిమిషాల ముందు అది కనిపిస్తుందని, చీకటిలో కూడా మనం దానిని చూడగలమని తెలిపారు. గత రెండు దశాబ్దాల్లో అత్యంత ప్రకాశవంతమైన తోకచుక్క ఇదేనని అభిప్రాయపడుతున్నారు. చిలీలోని అట్లాస్ సర్వే జనవరి 5న నిర్వహించిన పరిశోధనలో G3 ATLAS తోకచుక్క మొదట్లో అస్పష్టంగా కనిపించిందని, ఈ తోకచుక్క ఒక విప్లవాన్ని పూర్తి చేయడానికి 1,60,000 ఏళ్ల సమయం పడుతుందని తెలిపారు.