సంక్రాంతి పండుగ పూట ఏపీకి బిగ్ షాక్ తగిలింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో నేడు, రేపు వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కి.మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది. ఈ కారణంగా ఏపీ, యానంలో గాలులు అధికంగా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.