ఏపీలోని పురాతన దేవాలయాలను సంరక్షించాలని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబును తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ఆలయ భూములను వివిధ మతాలు వారు ఆక్రమించుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని, వెంటనే ఆలయాలకు వారి నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.