రియల్ లైఫ్‌లో పవన్.. ఆన్‌స్క్రీన్‌పై చరణ్: ఎస్జే సూర్య (వీడియో)
మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దర్శకుడు, డైరెక్టర్ ఎస్జే సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శంకర్ నుంచి తనకు ఆఫర్ వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించిందని పేర్కొన్నారు. ‘రాజకీయ నాయకుడికి, పవర్ఫుల్ ప్రభుత్వ అధికారికి మధ్య జరిగే యుద్ధమే మా సినిమా. రియల్ లైఫ్‌లో పవన్ కల్యాణ్ ఎలా పవర్‌ఫుల్‌గా వ్యవహరిస్తున్నారో.. ఆన్‌స్క్రీన్‌పై చరణ్ పాత్ర అలా ఉంటుంది’ అని తెలిపారు.