విశాఖ ఉక్కుతో కేంద్రం చెలగాటం: షర్మిల

75చూసినవారు
విశాఖ ఉక్కుతో కేంద్రం చెలగాటం: షర్మిల
AP: విశాఖ ఉక్కుతో కేంద్రం చెలగాటం ఆడుతోందని, ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే కుట్రలకు ఆజ్యం పోస్తూనే ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఈ నెల 8న విశాఖకు రానున్న ప్రధాని మోడీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమకు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. విశాఖ ప్లాంట్‌ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటించిన తర్వాతే విశాఖలో అడుగు పెట్టాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్