మాట్లాడటం, రాయడం ద్వారానే భాషను పరిరక్షించగలమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో కొనసాగుతున్న తెలుగు మహాసభల్లో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. 'పిల్లలతో రోజూ బాల సాహిత్యం చదివించాల్సిన అవసరం ఉంది. పాలన, అధికార వ్యవహారాలు తెలుగులో జరగాలి. ప్రాంతీయ భాష పరిరక్షణకు పెద్దల సహకారం కావాలి. కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు తెలుగులో ఉండాలి. కోర్టు తీర్పులు, సినిమాల పేర్లు తెలుగులో ఉండాలి' అని అన్నారు.