నిద్రలో బొద్దింకను శ్వాసనాళంలోకి పీల్చుకున్న 58 ఏళ్ల చైనా వ్యక్తి.. బయటకు తీసిన వైద్యులు
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో 58 ఏళ్ల వ్యక్తి శ్వాసనాళం నుంచి వైద్యులు, బొద్దింకను బయటకు తీశారు. సదరు వ్యక్తి నిద్రలో ఉండగా పురుగును పీల్చుకున్నాడని, అది శ్వాసనాళంలోకి చేరిందని వైద్యులు తెలిపారు. ముక్కు లోపల ఏదో పాకుతున్నట్లు అనిపించినా, అది గొంతువైపు వెళ్తున్నట్లు గమనించినా సదరు వ్యక్తి పట్టించుకోకుండా అలాగే పడుకోవడంతో ఈ ఘటన జరిగింది. ఇలాంటి కేసు ఇంతకు ముందెన్నడూ ఎదురుకాలేదని వైద్యులు తెలిపారు.