AP: పింఛన్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నారావారిపల్లెలో ఆయన మాట్లాడుతూ.. ‘భారతదేశంలో 64 లక్షల పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. పింఛన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ప్రజలకు ఇస్తుంది. పేదరికం, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 199 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. పైప్‌లైన్ ద్వారా రాష్ట్రంలో వంటగ్యాస్ సరఫరాకు శ్రీకారం చుట్టాం.’ అని అన్నారు.