AP: రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు పైరసీ భూతం వెంటాడుతోంది. తాజాగా ఏపీలోని కేబుల్ టీవీలో ఈ సినిమాను ప్రదర్శించారు. ‘ఏపీ లోకల్ టీవీ’ ఛానల్‌లో పైరసీ హెచ్‌డీ ఫ్రింట్ ప్రసారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. కాగా, ఈ సినిమా రిలీజ్‌కు ముందే కుట్రలు జరిగాయని చిత్ర బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.