గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారా?
ఉద్యోగరీత్యా గంటల తరబడి కూర్చోవడం వల్ల హైపర్ టెన్షన్, ఊబకాయం, డయాబెటిస్, హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఈక్రమంలో ఓ చిన్న జాగ్రత్తతో రోగాలు దరిచేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ అరగంటకి ఒకసారి బ్రేక్ తీసుకోవాలని సూచించారు. కుర్చీలోంచి లేచి 2-5 నిమిషాలు నడవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే వ్యాధుల బారిన పడరని, అకాల మరణాలు సంభవించవని తెలుపుతున్నారు.