అలాంటి ఘనత జగన్‌ది: మంత్రి నిమ్మల

70చూసినవారు
అలాంటి ఘనత జగన్‌ది: మంత్రి నిమ్మల
AP: సీఎం సహాయ నిధులను పక్కదోవ పట్టించిన ఘనత వైఎస్ జగన్‌దని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. పేదల వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుంచి రూ.22 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ ప్రభుత్వం వైద్యాన్ని పూర్తిగా దూరం పెట్టిందన్నారు. పేదలకు వైద్య సహాయంగా కూటమి ప్రభుత్వం రూ.కోట్లు అందిస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్