చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు వేయించిన శనగలు తింటుంటారు. వేయించిన శనగలలో ఎ,సి,బి6, ఫోలేట్, నియాసిన్, థైమీన్, రిబోఫ్లేవిన్ వంటి విటమిన్లు, మాంగనీస్, ఫార్సరస్, ఐరన్, కాపర్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి కూడా శనగలు మేలు చేస్తాయి.