
ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదు: నెతన్యాహు
ఇరాన్ క్షిపణి దాడుల్లో ఆసుపత్రులు లక్ష్యంగా మారడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. "మేము అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే, వాళ్లు అమాయకులే లక్ష్యంగా ఆసుపత్రులపై దాడులు చేస్తున్నారు. ఈ చర్యలకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదు. దాడుల నుంచి ఎవరూ తప్పించుకోలేరు" అని అన్నారు. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా అంతం చేస్తారనే సంకేతాలు ఇచ్చారు.