AP: తిరుమల శ్రీవారి ఆలయంలో గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. టీటీడీ పరిపాలన భవన ప్రాంగణ మైదానంలో గోదా కల్యాణాన్ని వేద పండితులు శాస్తోత్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై గోదాదేవి కల్యాణాన్ని తిలకరించారు. కల్యాణోత్సవ ఘట్టంలో శ్రీకృష్ణ స్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు.