ప్రముఖ ఆర్జే సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య!
ప్రముఖ ఆర్జే సిమ్రాన్ సింగ్ చనిపోయారు. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ ఫ్లాట్లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆమె స్వస్థలం జమ్మూ. సిమ్రాన్ సింగ్ మృతితో దేశ వ్యాప్తంగా ఆమె అభిమానులు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.