TG: సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాకేంద్రంలోని లెక్చరర్స్ కాలనీలో ఉండే తేజ (11) అనే బాలుడు గాలిపటం ఎగరవేస్తుండగా దారం తెగిపోయి.. సమీపంలో ఉన్న చెరువులో గాలిపటం పడిపోయింది. ఆ గాలిపటం కోసం చెరువులోకి వెళ్లి ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.