ఈటీవీ విన్లో ‘బచ్చలమల్లి’ మూవీ.. ఎప్పటినుంచంటే?
అల్లరి నరేశ్ కథానాయకుడిగా సుబ్బు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బచ్చలమల్లి’. ఈ చిత్రం జనవరి 10వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సంస్థ తాజాగా వెల్లడించింది. కాగా, ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి రావడం విశేషం.