రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక.. కాంగ్రెస్ కుంటి సాకులు చెబుతుందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం వల్ల తెలంగాణలో వ్యవసాయం పెరిగిందని అనేక నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. హామీలు అమలుచేయడం చేతకాక, లంకెబిందెలు ఉన్నాయనుకొని హామీలు ఇచ్చామని రేవంత్ రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.