మోటార్ బైక్ మీద ముగ్గురు లేదా నలుగురు వెళ్లడం చూసి ఉంటాం. వారి ఆర్థిక వెనకబాటుతనానికి అయ్యో పాపం అని జాలి పడి కూడా ఉంటాం. కానీ యూపీలోని షాజహాన్పూర్లో ఓ వ్యక్తి ఏడుగురిని బైక్పై ఎక్కించుకుని వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బైక్ ట్యాంక్పై ముగ్గురు పిల్లలు, అతని వెనుక ఓ మహిళ, ఆమె వెనుక మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లల జీవితాలను ప్రమాదంలో పెట్టొద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.