మేషం: అక్టోబర్
మేషరాశి వారి జీవితంలో ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో నిండి ఉంది. 2023లో మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితం చాలా క్లిష్టంగా ఉంటుంది. అక్టోబర్‌లో ఊహించని అడ్డంకులు తలెత్తే అవకాశం కూడా ఉంది.
వృషభం: ఏప్రిల్
ఈ సంవత్సరం చివరకు మీ వృత్తిపరమైన జీవితంలో మీరు తిరిగి ట్రాక్‌లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ మధ్యలో మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీ రాశులలోని గ్రహణాలు మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని సమస్యలకు తెరతీస్తాయి. ఏప్రిల్‌లో మీరు రోజూ చేసే పనులే చేయండి. మీ పాత పనివిధానాలకే కట్టుబడి ఉండాలి. కొత్తవి ట్రై చేయొద్దు. ఎలాంటి రిస్క్ లు తీసుకోవద్దు.
మిథునం: నవంబర్
మిథునరాశి వారికి ఈ సంవత్సరం మెరుపు వేగంతో సాగిపోతుంది. మీ బిజీ పనుల వల్ల మీకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉండవచ్చు. మీరు గందరగోళంలో ఉన్నప్పుడు మీ అవసరాలు, సరిహద్దులను మర్చిపోవద్దు. నవంబర్ లో మీరు మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు. మీకు సెలవు దినాల్లో కూడా ప్రశాంతత ఉండదు.
కర్కాటకం: డిసెంబర్
కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు 2023లో అత్యంత అదృష్ట చిహ్నాలలో ఒకరు కాబట్టి మీకు నిజంగా చెడ్డ నెలలు వస్తాయని చెప్పడం కష్టం. మీకు సంవత్సరం చివరిలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
సింహం: ఫిబ్రవరి
ఈ సంవత్సరంలో మీరు ఒక ప్రత్యేక వ్యక్తితో గొడవ పడే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో మీకు పెద్ద సమస్య వస్తుంది. మరో నాటకీయ ఘటన వేసవిలో ఎదురవుతుంది. ఏదేమైనా కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. వాలెంటైన్స్ డే తర్వాత మీ మాజీ పార్టనర్ తిరిగి మీ లైఫ్ లోకి వచ్చే అవకాశముంది.
కన్య: ఆగస్టు
కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో అత్యంత కష్టతరమైన నెల ఆగస్టు. అయినప్పటికీ మీకు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే బెటర్ గా ఉంటుంది. ఆగస్టు నెలలో మాత్రం సమస్యలు ఎదురవుతాయి. ఆ నెలలో జాగ్రత్తగా ఉండాలి.
తుల: సెప్టెంబర్
తులారాశి వారిని ఈ సంవత్సరం ఒత్తిడికి గురి చేస్తుంది. మీకు ఈ సంవత్సరం ప్రారంభంలో బాగుంటుంది. సెప్టెంబరులో మీరు జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
వృశ్చికం: మే
వృశ్చికరాశి వారి జీవితంలో ఈ సంవత్సరం చాలా మలుపులు ఉంటాయి. ఆ మలుపులకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. గత రెండేళ్ళుగా మిమ్ములను కుదిపేస్తున్న గ్రహణాలు ఈ సంవత్సరం ముగుస్తాయి. ఎట్టకేలకు ఒత్తిడి తగ్గుతుంది. మే నెలలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ధనుస్సు: జూలై
ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా వ్యక్తిగత అభివృద్ధి, విజయాలు ఉన్నాయి. కానీ మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. సంవత్సరాంతం మీ కోసం ప్రకాశవంతంగా కనిపిస్తున్నప్పటికీ, వేసవిలో మీకు సమస్యలు వస్తాయి. ధనుస్సు రాశికి దురదృష్టకరమైన సమయం జూలై నెలలో ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా కఠినంగా ఉండవచ్చు. కాబట్టి మీరు అధిక ఖర్చును తగ్గించి, పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలి.
మకరం: జనవరి
మకరరాశి వారు జనవరిలో పెద్ద నిర్ణయాలను తీసుకోవద్దు. ఈ నెలలో దురదృష్టకరమైన సమయం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా బాగుండవు.
కుంభం: జూన్
ఈ రాశి వారికి 2023 ప్రారంభం సాఫీగా సాగుతుంది. జూన్ నెలలో కొన్ని ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
మీనం: మార్చి
2023 చాలా కాలంగా మీన రాశికి చాలా సవాలుగా ఉన్నప్పటికీ ఆశాజనకంగా ఉంటుంది. మార్చి నెల వీరికి చాలా కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత 2023 సంవత్సరం శుభప్రదమైన సంవత్సరంగా మారుతుంది.