గ్రెనేడ్‌ దాడికి పాల్పడ్డ ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల అరెస్ట్‌(వీడియో)

59చూసినవారు
జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు లష్కర్‌ ఎ తోయిబా ఉగ్రవాదులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఒసామా యాసిన్‌ షేక్‌, ఉమర్ ఫయాజ్‌ షేక్‌, అర్ఫాన్‌ మన్సూర్ షేక్‌లుగా గుర్తించారు. ముష్కరులు శ్రీనగర్‌లో ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు పోలీసులు రైడ్‌ చేసి పట్టుకున్నారు. కాశ్మీర్‌ ఐజీ వీకే బిర్ది మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న ఈ దుండగులు జరిపిన గ్రెనేడ్ దాడిలో 12 మంది పౌరులు గాయపడ్డారని బిర్ది తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్