ఏపీలో ఆర్టీజీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వనరుగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ తప్పనిసరి చేసేలా చూడాలని, దానికి అనుగుణంగా ఉన్న సదుపాయాలపై కసరత్తు చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆధార్ లేకుండా ఉండకూడదని చెప్పారు.