ఎంబీయూపై ఆరోపణలు.. విద్యార్థులకు అండగా మంచు మనోజ్
నటుడు మోహన్ బాబుకు చెందిన ఎంబీ యూనివర్సిటీలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని విద్యార్థులు, ఆందోళన చేస్తున్న వేళ హీరో మంచు మనోజ్ ట్వీట్ చర్చనీయాంశమైంది. ఎక్స్ వేదికగా.. ‘ప్రస్తుత పరిస్థితులు బాధిస్తున్నాయి. ఈ సమయంలో విద్యార్థులకు అండగా ఉంటాను. నా తండ్రి మోహన్ బాబు విద్యార్థుల శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తారు. ఫిర్యాదులను నా మెయిల్‌కు పంపండి. నా తండ్రి దృష్టికి తీసుకెళ్తాను.’ అని మనోజ్ చెప్పారు.