ఎల్లుండి చైతు-శోభిత పెళ్లి.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు చూసేయండి!
హైదరాబాద్‌లో ఈనెల 4న అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి జరుగనున్న విషయం తెలిసిందే. అయితే వివాహ తంతులో భాగంగా పెళ్ళికి ముందే వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే సంప్రదాయబద్ధంగా మంగళస్నానాలు జరగ్గా, ఇందుకు సంబందించిన ఫొటోలు వైరలవుతున్నాయి. తాజాగా శోభితను పెళ్లి కూతురు చేసిన ఫొటోలను నిర్వాహకులు షేర్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన సెట్లో Dec 4న వివాహం జరగనుంది.