రేషన్ బియ్యం అక్రమ రవాణా.. ఇదో జాతీయస్థాయి కుంభకోణం: షర్మిల

79చూసినవారు
రేషన్ బియ్యం అక్రమ రవాణా.. ఇదో జాతీయస్థాయి కుంభకోణం: షర్మిల
ఏపీలోని రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలించడం జాతీయ స్థాయి కుంభకోణమని, దీని వెనుక పెద్ద మాఫియా ఉందని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. 'పేదల పొట్టకొట్టి రూ.48 వేల కోట్ల ప్రజాధనాన్ని పందికొక్కుల్లా తిని దోపిడీకి పాల్పడ్డారు. దీని వెనుక ప్రజా ప్రతినిధులు, కింది నుంచి ఉన్నత స్థాయి వరకు అధికారుల ప్రమేయం ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలి లేదా CBIతో విచారణ జరిపించాలి.' అని షర్మిల ఓ ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్