AP: పింఛన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్తో పాటుగా వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, కల్లు గీత కార్మికులు, తదితరులకు పింఛన్లు అందిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకూ ప్రభుత్వం నుంచి పింఛన్ అందుతోంది. ఈ కేటగిరీల్లో అర్హత ఉండి పింఛన్ అందని వారికి చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలవాలని నిర్ణయించింది. జనవరిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వనుంది.