కార్తీక మాసంలో శుక్లపక్షం ద్వాదశి తిధిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈ రోజు విష్ణువు 4 నెలల తర్వాత యోగ నిద్రలో నుంచి మేల్కొంటారు. ఉదయాన్నే తలంటు స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవాలని పురోహితులు చెబుతున్నారు. ఇవాళ ఏకాదశి ఉపవాసం విరమించి ఇంట్లో తులసి కళ్యాణం చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగి, ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని నమ్ముతారు. భార్యా భర్తల మధ్య విబేధాలు ఉంటే సమసిపోతాయని, పెళ్లికాని యువతులకు పెళ్లి జరుగుతుందని నమ్మకం.