నేడు పుష్య పౌర్ణమి.. ఈ దానాలు చేస్తే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు

66చూసినవారు
నేడు పుష్య పౌర్ణమి.. ఈ దానాలు చేస్తే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు
ఈ ఏడాది భోగి పండుగ అరుదైన శుభ యోగంలో వచ్చింది. 110 ఏళ్ల తర్వాత పుష్య మాసం పౌర్ణమి తిధి, సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చాయి. ఈ రోజున నదీ స్నానం ఆచరించాలి. అలాగే కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం చాలా ముఖ్యం. పుష్య పౌర్ణమి రోజున చేయాల్సిన దానాలు ఏంటంటే.. ఆహారం, డబ్బు, బట్టలు దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని, వ్యాపారంలో లాభం ఉంటుందని మత విశ్వాసం. పూజ సమయంలో దేశీ నెయ్యితో దీపం వెలిగించి సుఖశాంతులు ఇవ్వమని ప్రార్థించండి.

సంబంధిత పోస్ట్