విహారయాత్రలో విషాదం.. బీటెక్ విద్యార్థి మృతి
AP: అన్నమయ్య జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలోని గుంజేనేరు వాటర్ ఫాల్స్ విహారయాత్ర విషాదాంతమమైంది. బీటెక్ చదువుతున్న ఆరుగురు స్నేహితులు గిరి, సాయి, మోహన్, కేదార్, మల్లీ, దినేశ్ కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో సాయి తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సాయిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో యువకులు దారి తప్పిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు గాలింపు చర్యలు చేపట్టారు. యువకులను గుర్తించారు. కానీ సాయి అప్పటికే మృతి చెందాడు.