పుచ్చకాయపై రతన్ టాటా బొమ్మను చెక్కిన అభిమాని (వీడియో)
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ఇకలేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఓ అభిమాని రతన్ టాటాపై ఉన్న అభిమానంతో.. పుచ్చకాయపై రతన్ టాటా బొమ్మను చెక్కాడు. దాంతో రతన్ టాటాకు నివాళులు అర్పించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.