Top 10 viral news 🔥

హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని కేంద్ర మాజీ మంత్రికి గాయాలు
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ (79)కు గాయాలు అయ్యాయి. రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లోని తన నివాసంలో పూజా సమయంలో గిరిజా వ్యాస్ హారతి ఇస్తున్న క్రమంలో.. మంటలు ఒక్కసారిగా ఆమె శరీరాన్ని అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.