
తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ వాయిదా!
తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి 1న లక్ష తెల్ల రేషన్‌కార్డుల పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా పలు జిల్లాల్లో కార్డు దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడంతో పంపిణీ వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొందరికి కార్డులు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.