తమిళనాడులోని విలకేతి గ్రామంలో ఓ నిమ్మకాయ రూ.13 వేలు పలికింది. పళమ్తిన్ని కరుప్ప ఈశ్వరన్ ఆలయంలో వార్షిక మహా శివరాత్రి పండుగల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో పూజా కార్యక్రమాల్లో ఉపయోగించే ఒక నిమ్మకాయను రూ.13 వేలకు వేలం వేశారు. నిమ్మకాయతో పాటు ప్రధాన దేవత విగ్రహంపై ఉంచిన ఇతర వస్తువులను కూడా వేలం వేశారు. వాటిలో వెండి ఉంగరం కూడా ఉంది.