నాలుగు కాళ్లతో పుట్టిన కోడి పిల్ల (వీడియో)

74చూసినవారు
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రాఘబోయినగూడెంలో ఓ కోడి పిల్ల నాలుగు కాళ్లతో జన్మించింది. ఈసాల పగడయ్య అనే గిరిజన వ్యక్తి ఇంట్లో 10 రోజుల క్రితం ఓ కోడి 20 గుడ్లపై పొదిగి 15 పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక కోడి పిల్ల 4 కాళ్లతో జన్మించింది. ఈ సందర్భంగా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఇలాంటి అనేక వింతలు, విశేషాలు జరుగుతాయని చెప్పిన విషయాన్ని కొందరు గుర్తుచేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్