
12వ శతాబ్ధంలో ప్రారంభమైన వక్ఫ్ సంప్రదాయం
ఇస్లాం సంప్రదాయంలో, ముస్లిం సమాజ ప్రయోజనాల కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. ఈ ఆదాయాన్ని మసీదులు, శ్మశానవాటికలు, మదర్సాలు, అనాథాశ్రమాల నిర్వహణకు ఉపయోగిస్తారు. వక్ఫ్ ఆస్తిని నిర్ధారించిన తరువాత, దానిని విక్రయించడం లేదా బదిలీ చేయడం సాధ్యం కాదు. 12వ శతాబ్ధంలో దిల్లీ సుల్తానుల పాలనలో భారతదేశంలో వక్ఫ్ సంప్రదాయం ప్రారంభమైంది. 1995 వక్ఫ్ చట్టం ప్రకారం, వక్ఫ్ ఆస్తులను రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తాయి.