నా ధైర్యం ‘చంద్రబాబు’: నారా లోకేశ్ (వీడియో)

80చూసినవారు
AP: ప్రకాశం జిల్లా దివాకరపల్లి సమీపంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు బుధవారం మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే గుర్తొచ్చేది ప్రేమ, పౌరుషం. ఈ జిల్లాలో యువగళం ఒక ప్రభంజనంగా నడిచింది. నా ధైర్యం, నా బ్రాండ్ ఒకరే. అదే సీబీఎస్. తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు ఉంది.. ఏపీకి ఏముందని నా ఫ్రెండ్ అడిగాడు. మాకు చంద్రబాబు ఉన్నారని చెప్పా.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్