లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు వచ్చింది. దీనిపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ ముగిసిన అనంతరం ఓటింగ్ చేపట్టే అవకాశం ఉంది. వక్ఫ్ సవరణ బిల్లు తీసుకురావాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరిస్తున్నారు. జేపీఎస్ నివేదికతో వక్ఫ్ బిల్లును సవరించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ బిల్లును విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి.