
SLBC కుప్పకూలి నేటికి సరిగ్గా నెలరోజులు: హరీశ్
SLBC సొరంగం కుప్పకూలి నేటికి సరిగ్గా నెలరోజులు అయిందని BRS నేత హరీశ్ రావు తెలిపారు. ఒకరి మృతదేహం వెలికి తీయడం తప్ప, మిగతా ఏడుగురి జాడ కనుగొనడంలో ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. 'మృతదేహాలు వెలికితీయడంతో ఈ ప్రభుత్వం ఘోర వైఫల్యం ఉంది. బాధిత కుటుంబాల తీవ్ర వేదనకు సీఎం బాధ్యత వహించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలి. సహాయక చర్యలపై పూర్తి వివరాలు బయటపెట్టాలి' అని డిమాండ్ చేశారు.