నన్ను చంపేందుకు కుట్ర జరిగింది: సీఎం చంద్రబాబు
వైసీపీ హయాంలో అందరి కంటే ఎక్కువ వేధింపులకు గురైంది తానేనని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను జైలులో ఉన్నప్పుడు నన్ను చంపేందుకు కుట్ర జరిగింది. జైలుపై డ్రోన్లు ఎగురవేశారు. సీసీ కెమెరాలు పెట్టారు. జైలులో నాకు దోమ తెర కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వారిపై కక్ష తీర్చుకోవడం నా లక్ష్యం కాదు. ప్రభుత్వంపై చేస్తున్న దుష్ఫ్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం.’ అని అన్నారు.