హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్ మహా నగరంలో ఇక ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ సర్కార్ అండర్ గ్రౌండ్ టన్నెల్స్‌ను భారీ ఎత్తున నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. అందుకే ఈ ప్రాంతాలకు కనెక్టివిటీగా ఉన్న కేబీఆర్ పార్కు దగ్గర అండర్ గ్రౌండ్లో భూగర్భ సొరంగ మార్గాల నిర్మాణాలకి ప్రభుత్వం సిద్ధమైంది.