రెండు రోజులు పోలీస్ కస్టడీకి నందిగం సురేష్
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈ నెల 17న మధ్యాహ్నం వరకు పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారించనున్నారు. విచారణ సందర్భంగా లారీ ఛార్జ్, దూషించడం, భయపెట్టడం వంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వులు వెల్లడించింది.