HYD ఎక్సైజ్ పోలీసులకు లంచం ఇవ్వకపోవడంతో తనను ఇరికించాలని చూశారని అరికో కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి ఉన్నతాధికారులకు, మానవహక్కుల కమిషన్ కు శరత్ చంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. 'డెకాయ్ ద్వారా పదకొండున్నర కిలోల కేక్ ఆర్డర్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా నగదు పంపించి.. విస్కీ బాటిక్ కొని కేక్‌లో కలపాలని చెఫ్ దయాకర్‌కు చెప్పారు. అలా కుదరదని దయాకర్ చెప్పడంతో వాచ్‌మన్ తాగి పడేసిన మందు బాటిళ్లు లోనికి తీసుకొచ్చి.. రైడ్ చేసినట్టు డ్రామాలు ఆడారు' అని వివరించారు.